డిసెంబర్ 2, 2014

మేకకు తోడేలు సలహా

Posted in సాంఘికం-రాజకీయాలు వద్ద 9:17 సా. ద్వారా వసుంధర

ఆడతనాన్ని స్పష్టం చేసే వస్త్రధారణవల్ల అమ్మాయిలకు అబ్బాయిలవల్ల ఇబ్బందులు ఎదురవచ్చు. ఈ విషయాన్ని మేము బెల్లంముక్క (విపుల మాసపత్రిక నవంబర్ 1983) కథలో సున్నితంగా సూచించి ఉన్నాం.  అప్పటికీ ఇప్పటికీ రోజులు బాగా మారిపోయాయి. అమ్మాయిలు అబ్బాయిలు చేసే పనులన్నీ చేస్తున్నారు. అబ్బాయిలకే బాసులౌతున్నారు.  అరిటాకు-ముల్లు సామెతను పట్టించుకునే స్థాయిని ఏనాడో దాటిపోయారు. సమాజంలో అబ్బాయిలకున్న స్వేచ్ఛను వారు తమకూ సాధించుకున్నారు. ఇది సహించలేని పురుషాహంకారులు కొందరు ఇంకా వారిని శాసించే ధోరణిలోనే ఉన్నారు. అది ఎంతవరకూ వెళ్లిందంటే మహిళలపై అత్యాచారం జరిగితే, అందుకు మహిళలనే తప్పు పట్టేంతవరకూ. అత్యాచారం అతి ఘోరమైన నేరం. దానికి సంజాయిషీలు లేవు. అత్యాచారంలో మొదటి తప్పు అత్యాచారిది. రెండో తప్పు అత్యాచారిని పెంచి పెద్ద చేసినవారిది. అంతే! ఈ నేపథ్యంలో ఈ క్రింది వార్త- ఈసప్ కథలో- నెపం మేకపిల్లపై  వేసిన తోడేలుని గుర్తు చేసింది. ఇక్కడ మేకపిల్ల మహిళలకీ, తోడేలు పురుషాధిక్య వ్యవస్థకీ ప్రతినిధులుగా తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఏ వ్యక్తుల్నీ ఉద్దేశించినది కాదు.

anadiga

ఆంధ్రజ్యోతి

2 వ్యాఖ్యలు »

  1. వార్తకు మీరు పెట్టిన మకుటము అపార్ధాలకు దారి తీస్తుందేమో గమనించండి.

    • Laya said,

      Daani ardhamemiti


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: