నవంబర్ 13, 2013

ఓహో- తెలుగు పద్యమా!

Posted in భాషానందం వద్ద 7:50 సా. ద్వారా వసుంధర

సాహిత్యపు విలువలున్న సర్కస్ ఫీట్సుని అక్షరాలలో ప్రదర్శించడంలో- ప్రపంచ సాహిత్యంలోనే తెలుగు పద్యపు ప్రతిభ అసామాన్యం. మచ్చుకి శ్రీ మోచర్ల హరికృష్ణ పంపిన ఈ క్రింది తెలుగు పద్యాల ప్రక్రియలు చూడండి. శ్రీ హరికృష్ణకు ధన్యవాదాలు.
         అనులోమ విలోమ కందము
నాయశరగ సార విరయ 
 తాయన జయసార సుభ గధర ధీ నియమా
 మాయని ధీర ధభగ సుర
 సాయజ నయ తాయర విరసాగర శయనా
           ఈ  పద్యము ముక్కు తిమ్మనార్యుని “పారిజాతాపహరణము” నుండి నారదుడు శ్రీ కృష్ణుని పొగడిన, స్తుతించిన పద్యము.  మొదటి రెండు పాదములు  చివరి నుండి చదివినచో, మూడు నాలుగు పాదములు అగును అనగా వెనుకనుండి చదివినననూ  ముందునుండి చదివిననూ ఒకటే విధముగా యుండును.  ఇట్టి ప్రయోగమును అర్ధ భ్రమక కందముగా గుర్తించవలెను.
         ద్వ్య క్షరి కందము
మనమున ననుమానము నూ

నను నీ నామ మనుమనుమననమును నేమ
మ్మున  మాన నన్ను మన్నన 
మను మను నానా మునీన మానా నూనా
          కంద పద్యములో కేవలము రెండు అక్షరములను మాత్రమే తీసుకొని పద్యము వ్రాసిన ఘనత ముక్కు తిమ్మన్నకు దక్కును. ఉదాహరణకు ‘మ’ ‘న’ అను అక్షరములతో వారిచే రచింప బడిన ఈ  కంద పద్యము ఒక చక్కని మచ్చు తునక.

6 వ్యాఖ్యలు »

 1. vidyamanohar sharma said,

  4వ తరగతిలో తన గురువుగారు చదివి వినిపించిన పద్యం

  “మనమున ననుమానము నూ
  నను నీనామ మనుమనుమననమునునేమ
  మ్మున మాన నన్ను మన్నన
  మను మను నానామునీనమానానూనా!”

  తో స్ఫూర్తిని పొంది అష్టకాల నరసింహరామ శర్మ https://www.facebook.com/Astakala-Narasimharama-Sharma-1242721929205328/ గారు రాసిన పద్యం

  మననము మానను నమనము
  నను నానా నామ మాన ననుమననిమ్మా
  నిను మనమున నమ్మిన మ
  న్మనమున మనుమన్న మిన్న మామనమెన్నన్

  గురువుగారు చదివిన పద్యం ఎక్కడిదో అడిగి తెలుసుకునే ధైర్యము లేక కనిపించిన ప్రతి పుస్తకం తిరగేసి (చదివి అని కాదు) ఎక్కడా దొరకక పోవడంతో … నేనే రాస్తే సరి అని పూనుకొని రాసిన పద్యం … తరవాత కొంత కాలానికి గురువుగారికి వినిపించడం జరిగింది … అప్పుడు ఆయన చెప్పారు … తాను చదివిన పద్యం పారిజాతాపహరణం లోనిది అని

  • మీరు అందించిన సమాచారానికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన పద్యాలను మాతో పంచుకోగలరు. మరికొన్ని పద్యాల్ని నేడు అక్షరజాలం టపాల్లో చూడగలరు.

  • అష్టకాల నరసింహరామ శర్మ గారు https://www.facebook.com/Astakala-Narasimharama-Sharma-1242721929205328/ ఇప్పటికి 170 కి పైగా అవధానాలు చేసారు .
   అవధానాలు, వాస్తు, జ్యోతిషం ద్వారా వచ్చిన సొమ్ము అంతా సరస్వతీ ఆలయ నిర్మాణానికై ఖర్చు పెట్టారు.

   సమస్య: పతి తలగోసి భర్తకిడె బందుగులందరు సంతసింపగా
   8వ అవధానం – సిద్ధిపేట

   కుతుకము మీఱ శ్రీనగము గూర్చి సముద్యతులై ప్రయాణమై
   సుతతతి తోడ గూడి యొకచో విడియంగ క్షుధార్తి పెంపు తత్
   క్షితి నశనంబు వండియు రుచింగను పచ్చడి తింత్రిణీ కురుట్
   పతి తలగోసి భర్తకిడె బందుగులందరు సంతసింపగా
   తింత్రిణీ కురుట్ పతి=చింత చెట్టు, తల =చిగురు భాగము

   సమస్య: గ్రీష్మము నందు బైట తొలగించియు గోడలు కోరె మామనే
   21 వ అవధానం – హైదరాబాదు

   ఊష్మము మాట గుర్తెరుగ నొల్లని కన్నియనెంచి యెంచి య
   ర్చిష్మదనూన తాపుడగు రేవడి కీయగ నేదిగోరినన్
   భీష్మత జూపు నెండలకు వేగక జల్వల వల్వలందగన్
   గ్రీష్మము నందు బైట తొలగించియు గోడలు కోరె మామనే

   ఊష్మము =వేడి, రేవడు = చాకలి, అర్చిష్మత్ =అగ్నికి, అనూన =తక్కువగాని
   భీష్మత = కోప తీవ్రత, జలువలవలువలు =ఇస్త్రీ గల చీరలు
   మేనకోడలును వివాహమాడు సంప్రదాయమును బట్టి భర్తను మామా అని పిలుచుట కలదు

  • మీరందించిన సమాచారం విలువైనది. ధన్యవాదాలు. విడిగా టపాలో కూడా ఉంచుతున్నాం.

  • Vidyamanohar Sharma said,

   ,🙏🙏🙏

 2. CS Sarma said,

  ఓహో- తెలుగు పద్యమా, పంపిన శ్రీ హరికృష్ణకు ధన్యవాదాలు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: