మార్చి 6, 2010

హరిత కవిత 2009

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 5:07 ఉద. ద్వారా వసుంధర

జాగృతీకిరణ్ ఫౌండేషన్- మల్లెతీగ సకుటుంబ మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో

పర్యావరణ కవితోద్యమంలో భాగంగా

తెలుగులో 2వ అంతర్జాతీయ పర్యావరణ కవితల పోటీ: హరిత కవిత 2009.

మొదటి బహుమతి: రూ 1500, బంగారు పతకం వగైరా

రెండవ బహుమతి: రూ 1000, బంగారు పతకం వగైరా

మూడవ బహుమతి: రూ 500, బంగారు పతకం వగైరా

ఇంకా 4 ప్రోత్సాహక బహుమతులు (ఒకొక్కటి రూ 250), 5 ప్రత్యేక బహుమతులు (ఒకొక్కటి రూ 200).

వివరాలు

1. కవిత 30 పంక్తులకు మించకూడదు. రచన తమ స్వంతమేనంటూ కవులు హామీపత్రం, పూర్తి చిరునామా (పిన్‌కోడ్, మొబైల్ నంబరు) పాస్‌పోర్ట్ సైజు ఫొటో, జీవిత వివరాలు జతపర్చాలి. కవి పేరు కవితతోపాటు కాక హామీపత్రంలో వ్రాయాలి.

2. కవితలు పర్యావరణ సమస్యలు, పరిరక్షణ, నివారణోపాయం అంశాలకు పరిమితం కావాలి.

3. పోటీ మల్లెతీగ చందాదారులకు మాత్రమే. చందాదారులు కానివారు రూ 120 మల్లెతీగ కార్యాలయానికి మనియార్డరుగా పంపాలి.

4. విజేతల వివరాలు అంతర్జాతీయ సంస్థలైన యునెస్కో వగైరాలకు పంపబడతాయి.

5. కవరుపై హరిత కవిత-2009 అని స్పష్టంగా వ్రాయాలి.

ఇంకా అనేక ఆసక్తికరమైన వివరాలకు మల్లెతీగ మార్చి 2010 సంచిక చూడవచ్చు. మల్లెతీగ మొబైల్ 92464 15150 కి కూడా ఫోన్ చేయవచ్చు.

చిరునామా: హరిత కవిత 2009, సంపాదకుడు, మల్లెతీగ సకుటుంబ మాసపత్రిక, డోర్ నెం. 41-20/6-43, పోలీసు రామయ్య వీధి, కృష్ణలంక, విజయవాడ 520 013, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.

గడువు తేదీ: మే 30, 2010.

సరసమైన కవితల పోటీ

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 4:24 ఉద. ద్వారా వసుంధర

కార్టూనిస్ట్, కథారచయిత, కాలమిస్ట్ భువన్ వారి తండ్రి జ్ఞాపకార్థం “మల్లెతీగ”తో కలిసి నిర్వహిస్తున్న

మళ్ల జగన్నాధం స్మారక సరసమైన కవితల పోటీ.

ప్రథమ బహుమతి: రూ 500.

ద్వితీయ బహుమతి: రూ 300.

ఒకొక్కటి రూ 100 చొప్పున 12 ప్రత్యేక బహుమతులు.

నిబంధనలు:

1. కవిత 20 పంక్తులకు మించరాదు.

2. సరసమే తప్ప శృతి మించిన శృంగారం పనికిరాదు.

3. శీర్షిక, అంశం వినూత్నంగా ఉండి సందేశం మిళితమైన కవితలకు ప్రాధాన్యం.

చిరునామా: ఎం.విజె. భువనేశ్వరరావు (భువన్), డోర్ నెం. 15-21-12/3, ఉమెన్స్ కాలేజీ వద్ద, అనకాపల్లి 531 002, విశాఖ జిల్లా

ఆఖరి తేదీ: ఏప్రిల్ 30, 2010.

అనిల్ అవార్డ్ కథల పోటీ

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 3:56 ఉద. ద్వారా వసుంధర

విభిన్నమైన ఇతివృత్తాలతో కథాసాహిత్యంలో ఆణిముత్యాలుగా కలకాలం నిలిచిపోయే కథలను ఆహ్వానిస్తూ స్వాతి మాసపత్రిక ఏప్రిల్ (2010) సంచికలో అనిల్ అవార్డ్ కథల పోటీ ప్రకటించింది.
రూ 10000 బహుమతి. సాధారణ ప్రచురణకు తీసుకున్న ప్రతి కథకూ రూ 1000. 
నిబంధనలు:
1. అరఠావు సైజులో 10 పేజీలు మించకూడదు. కాగితానికి ఒక వైపున మాత్రమే వ్రాయాలి.
2. అనువాదాలు, అనుకరణలు, ఇతర పత్రికలకు పంపబడి పరిశీలనలో ఉన్నవి పంపవద్దు. కథ స్వీయ రచన, అముద్రితం- అని స్వదస్తూరీతో వ్రాసిన హామీపత్రం జతపర్చాలి.
3. ప్రచురణకు స్వీకరించని కథలు తిప్పి పంపాలంటే- తగినన్ని స్టాంపులు అతికించిన కవరుపై స్వంత చిరునామా వ్రాసి జత పర్చాలి.
4. కవరుమీద ” అనిల్ అవార్డ్ కథలపోటీకి” అని వ్రాయాలి
చిరునామా: ఎడిటర్, స్వాతి సచిత్ర మాసపత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావు పేట, పోస్ట్ బాక్స్ 339, విజయవాడ 520 002
ముగింపు తేదీ: ఏప్రిల్ 30, 2010