ఏప్రిల్ 30, 2009
బుల్లితెర “కోతికొమ్మచ్చి”
ప్రస్తుతం స్వాతి వారపత్రికలో ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ తన జీవిత విశేషాలను- కోతికొమ్మచ్చి- అనే శీర్షికలో వారం వారం అపూర్వంగా వినిపిస్తున్నారు. ఒక వరుసక్రమంలో కాకుండా సందర్భానుసారంగా ముందువి వెనుకా, వెనుకవి ముందూ చెబుతూ- కొతికొమ్మచ్చికి- ఒక ప్రక్రియ యోగం పట్టించారు. ఆర్యుల ప్రక్రియలు గ్రాహ్యంబులు అనుకుంటూ- అదే ప్రక్రియను బుల్లితెర ముచ్చట్లకు వర్తింపజేస్తున్నాం.
ranjani said,
జూన్ 24, 2010 వద్ద 11:38 ఉద.
ఈ టపాని నేనిప్పుడే చూస్తున్నాను . ప్రస్తుతం ఎడ్యులెంట్ సైటు పనిచేస్తున్నట్లు లేదు.
మరి ఈ ఫైళ్లు వేరే ఎక్కడైనా ఉంటే – దయచేసి వాటి లంకెలనివ్వరూ … – రంజని
వసుంధర said,
జూన్ 26, 2010 వద్ద 3:43 ఉద.
ఎడ్యులెంటు తాత్కాలికంగా నిలిపివేయబడింది. అక్షరజాలం యధాతథంగా కొనసాగుతోంది. మీరు అక్షరజాలంలోకి నేరుగా రావచ్చును. మీ ఉత్తరం చూసాక బుల్లితెర కోతికొమ్మచ్చికి సంబంధించిన మిస్సింగు ఫైల్సు తిరిగి జతపర్చాము. మీ ఆసక్తికి ధన్యవాదాలు.