అక్టోబర్ 26, 2008

సాహితీ సమాచారం

Posted in సాహితీ సమాచారం వద్ద 10:52 ఉద. ద్వారా వసుంధర

తెలుగు సాహిత్యానికి విశిష్టసేవ చేస్తున్న వ్యక్తుల, సంస్థల, వెబ్‌సైట్ల వివరాలని అందజేసే ఈ వేదిక- తెలియనివారు తెలుసుకుందుకూ, తెలిసినవారు తెలియనివారితో పంచుకుందుకూ సహకరిస్తుందని ఆశిస్తున్నాం.      

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహణలో హైదరాబాదులో ఫిబ్రవరి 14-16 తేదీలలొ జరుగనున్న రెండవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకి అందరూ అహ్వానితులే. వివరాలకి ఇక్కడ క్లిక్ చేయండి
official-inviation-for-rendava-prapancha-telugu-sahithi-sadassu11

vfa-literary-club-enrollment-form11  

కథానిలయం

సి.పి.బ్రౌన్ అకాడెమీ

కథల పోటీలు

సీపీ బ్రౌన్ అకాడెమీ- స్వాతి సపరివారపత్రిక సంయుక్త నిర్వహణలో జరిగిన కథల పోటీ ఫలితాలు స్వాతి 30-1-2009 సంచికలో వచ్చాయి. శ్రీ పసుపులేటి తాతారావు కథ “ఎక్కడో ఏదో” కి 25వేల రూపాయల ప్రథమ బహుమతి లభించింది. ఇంకా 3 కథలకి ద్వితీయ  బహుమతులు, 5 కథలకి తృతీయ బహుమతులు, 6 కథలకి ప్రత్యేక బహుమతులు, 20 కథలకి సాధారణ బహుమతులు లభించాయి. విజేతలని అభినందిద్దాం. స్వాతిలో పోటీ కథల ప్రచురణకై ఎదురుచూద్దాం. 

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా కథల పోటీ ఫలితాలు
స్వదేశాంధ్ర విజేతలు
 
మేరెడ్డి యాదగిరి రెడ్డి (కొలిమి)
అవసరాల రామకృష్ణా రావు (ముసుగు)
పి.వి. శేషారత్నం (మాయ సోకని పల్లె)

విదేశాంధ్ర విజేతలు

Nirlamaditya (గమ్యం లేని ప్రయాణాలు)
R. Sarma Danthurthi (గ్రక్కున విడువంగ వలయు)
 
నిర్వాహకులకి అభివందనాలు. విజేతలకు అభినందనలు. విజేతలు కానివారు తమ రచనలని వేరెక్కడైనా ప్రచురణకి పంపుకోవచ్చని నిర్వాహకులు తెలియజేస్తున్నారు.  

నవలల పోటీలు

పుస్తకాలు

 

5 వ్యాఖ్యలు »

 1. ramaraju M said,

  “తేజ” అనే వార పత్రికలో , నవలల పోటీ ప్రకటించారని విన్నాను.
  దయచేసి దాని పూర్తి వివరాలు తెలియచేయండీ?

  • ప్రస్తుతం మార్కెట్లో తేజ వారపత్రిక జూన్ 5 సంచిక ఉంది. అందులో ఏ పోటీ ప్రకటనా లేదు. తరువాతి సంచికలో వస్తే చూసి తప్పక వివరాలివ్వగలం. తాజాగా స్వాతి వారపత్రిక నవలల పోటీ ప్రకటించింది. ఒకటి రెండు రోజుల్లో ఆ వివరాలందజేయగలం.

 2. bhanumathi mantha said,

  సాహితీ మిత్రులందరికీ నమస్కారం.
  నాకు నవంబర్ ఇరవయ్యో తేదీన “లేఖిని” మహిళా చైతన్య సంస్థ వారి నిర్వహించిన డా.వంగూరి చిట్టెంరాజు గారి సన్మాన సభకి వెళ్ళే అవకాశం కలిగింది. రచయిత్రి గంటి భానుమతిగారు ఫోన్‍లో వివరాలు అందించగా అందరినీ పరిచయం చేసుకోవడానికి వీలవుతుందని వెళ్ళాను.
  ఆహ్లాదకరమైన సాయంకాలం..అదే మొదటిసారి లేఖిని సభలకి హాజరు కావడం. ఎలా ఉంటుందోనని సంకోచంతోనే వెళ్ళాను. కానీ అక్కడ అసలు కొత్త అనిపించకుండా చక్కగా పలుకరించారు, పేరుపొందిన రచయిత్రులందరూ.
  వాసా ప్రభావతి గారు, ముక్తేవి భారతి గారు నాకు అంతకుముందే పరిచయం.
  “చుట్టుప్రక్కలంతా తవ్విపోసేశారండీ! ఎక్కడ పడిపోతానో అని భయంవేసింది నడుస్తుంటే..” వెళ్తూనే జనాంతికంగా అన్నాను. అక్కడికి నేనే ఏదో కష్టపడిపోయినట్లు.
  “అదే కదండీ మరి..సాహిత్య సభల మీది ఆసక్తికి పరీక్ష..” పాటిబండ్ల విజయలక్ష్మి గారు సహజధోరణిలో నవ్వుతూ పలుకరించారు.
  అలసట పోయేలా, మిత్రులు తేనీటి విందుతో స్వాంతన పరిచారు.
  సన్మాన సభ అనుకున్న టైమ్‍కీ ఖచ్చితంగా ఆరుగంటలకి మొదలుపెట్టారు.
  పోతుకూచి సాంబశివరావుగారు వ్యాఖ్యాత. చిట్టెంరాజుగారు చెయ్యికి కట్టుతో (ఫ్రాక్చర్ అయిందిట) చిరునవ్వుతో కూర్చున్నారు. ఆంధ్రభూమి లక్ష్మిగారు, వాసా ప్రభావతి, వంశీ రామరాజు గారు వేదిక నలంకరించారు. వేదిక మీద కాకుండా కింద వేశారు..ముఖ్య అతిధులకి కూడా. అందుకే నేను “డ్రాయింగ్‍రూంలో కూర్చుని మాట్లాడు కుంటున్నట్లు గా ఉంది” అని వ్యాఖ్యానించాను.
  అందరూ చిట్టెంరాజు గారి గురించి, ఆయన హాస్య, చమత్కార రచనల గురించీ చెప్పారు. ఆఖరుకి నేను కూడా.
  చిట్టెంరాజు గారు కృతజ్ఞతలు చెప్తూ, మస్కట్‍లో జరగబోయే ప్రపంచ సాహితీ సభల గురించి ప్రస్తావించి, ఆహ్వానించారు.
  ఆ విధంగా నా ప్రధమ లేఖినీ సభ, మరపురాని అనుభవంగా మిగిలింది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: