మే 11, 2012

లోలోపల

వర్గాలు పుస్తకాలు వద్ద 6:32 అపరాహ్నం ద్వారా వసుంధర

మే 3, 2012

పరదేశాల్లో పదనిసలు

వర్గాలు పుస్తకాలు వద్ద 4:14 అపరాహ్నం ద్వారా వసుంధర

జనవరి 29, 2012

వేమన మంత్రాలు- బాల సాహిత్యం

వర్గాలు పుస్తకాలు వద్ద 8:10 అపరాహ్నం ద్వారా వసుంధర

వేమన తెలుగునాట సుప్రసిద్ధ కవి.  ఆయన వ్రాసిన పద్యాలు ఐదు వేలకి పైగా ఉన్నాయి. మమూలు వాడుక పదాలతో మనసుకు హత్తుకుపోయే జీవిత సారాన్ని ఇముడ్చుకున్న అసాధారణ కవిత ఆయనది. సామాన్యులను నైతిక విలువలు అనుసరించేలా చేయగల మంత్రాలుగా వాటిని పరిగణించడం కద్దు. ప్రచారంలో ఉన్న ఆ పద్యాలను సేకరించి, అచ్చొత్తించిన ఘనత ఆంగ్లేయుడైన సి.పి. బ్రౌన్ దొరది. ఆయన తెలుగు భాషాభిమానం మనకు గర్వకారణమే కాదు, వరం కూడా. ఈ కింద పరిచయం చేస్తున్న పుస్తకంలో ఎన్నిక చేసిన వేమన పద్యాల ఆధారంగా అల్లిన ౧౫ కథలున్నాయి. రెండుముఖ్య పాత్రలతో నడిచే ఆ కథలు- ఒకదానితో ఒకటి ముడివడినా విడివిడిగానూ సంపూర్ణం. ప్రతి కథలోనూ ఒక వేమన పద్యం. ప్రతి ఒక పేజీ కథకూ- ప్రక్కనే ఒక పేజీ రంగుల బొమ్మ. ఈ కథలు పిల్లలకని ఉద్దేశించినా, అన్ని వయసులవారినీ అలరించగలవనిపిస్తుంది.  ఈ పుస్తకం ఆంగ్లానువాదం వివరాలకి ఇక్కద క్లిక్ చెయ్యండి.

జనవరి 26, 2012

మిథునం- ఒక ప్రకటన

వర్గాలు పుస్తకాలు వద్ద 2:23 అపరాహ్నం ద్వారా వసుంధర

జనవరి 24, 2012

కపాలదుర్గం- పుస్తకావిష్కరణ

వర్గాలు పుస్తకాలు వద్ద 11:59 పూర్వాహ్నం ద్వారా వసుంధర

చందమామ అభిమానులకు నమస్కారం.

52 సం: పాటు చందమామ సంపాదక మండలిలో పనిచేసి
తోకచుక్క, మకరదేవత, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట, జ్వాలాద్వీపం,  రాకాసిలోయ, పాతాళ దుర్గం, శిథిలాలయం, రాతి రథం, యక్షపర్వతం, మాయ సరోవరం, భల్లూక మాంత్రికుడు, మృత్యులోయ, శిథిలనగరం, మంత్రాల దీవి, గంధర్వ నగరం, సర్పకన్య, కపాల దుర్గం

మొదలైన  జానపద సీరియల్స్  ద్వారా  చందమామ, బొమ్మరిల్లులో-  ఆబాల గోపాలాన్ని ఆకట్టుకొని, అలరించి, మంత్ర ముగ్ధుల్ని గావించి,   అందమైన, అద్భుతమైన, అలౌకిక లోకాల్లో విహరింప చేసిన చందమామ కథా మాంత్రికుడు, జానపద నవలా సమ్రాట్
 శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారి రెండవ వర్ధంతి సందర్భంగా  జరుగు కార్యక్రమానికి  బాల సాహిత్య పరిషత్తు మీకు ఆహ్వానం పలుకు తోంది. ఈ కార్యక్రమంలో చందమామ అభిమానుల అనుభవాలు, అభిభాషణలు వుంటాయి.
ఈ సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యం గారి కపాల దుర్గం (ప్రమోద, పిల్లల మాస పత్రిక సీరియల్ ) ఆవిష్కరణ వుంటుంది.
 ప్రమోద  సంపాదకులు, శ్రీ ధనికొండ శ్రీధర్, శ్రీ వేమూరి సత్యనారాయణ గారలు  అతిధులుగా పాల్గొనే ఈ కార్యక్రమంలో అనేక మంది చందమామ అభిమానులు పాల్గొంటారు.
వేదిక: సమావేశ మందిరం, సిటి సెంట్రల్ లైబ్రరి, అశోక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాదు.
తేది: 27-01-2012 శుక్రవారం సా: 6.30 గం:లకు.
గమనిక: ఈ కార్యక్రమంలో ఊకదంపుడు ఉపన్యాసాలుండవు.
ఆహ్వానం

Dasari Venkata Ramana
General Secretary
Balasahitya Parishat
Ph: 04024027411. Cell: 9000572573.
email: dasarivramana@gmail.com

Chokkapu Venkata Ramana
President
Balasahitya Parishat
Cell: 9246520050
email: magiccho@gmail.com

తర్వాతి పేజీ

Follow

Get every new post delivered to your Inbox.