జూలై 11, 2012
విలక్షణ నటుడు సిఎస్ ఆర్
తెలుగు సినీరంగంలో నటనలో, పలుకులో తనదంటూ ఒక బాణీని నెలకొల్పి, అనితరసాధ్యంగా నిర్వహించిన మహానటుడు సిఎస్‍ఆర్. వీరు మంచి నటులే కాక మంచి గాయకులు కూడా. నేడు వీరి జన్మదినం. ఆ విషయం మనకు గుర్తు చేస్తూ- శ్రీ టీవీఎస్ శాస్త్రి నివాళులర్పిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఆ వ్యాసానికై ఇక్కడ క్లిక్ చెయ్యండి. శ్రీ సిఎస్‍ఆర్‍కి సంబంధించిన ఎన్నో విశేషాలను శ్రీ శాస్త్రి ముచ్చటించారు. ఈ సందర్భంలో చిన్నప్పుడు చూసిన రాణీ రత్నప్రభ చిత్రాని ప్రస్తావించాలి. ఎన్టీఆర్, అంజలి, రేలంగి, గుమ్మడి ప్రభృతులు నటించిన ఈ చిత్రాన్ని తలచుకున్నప్పుడు- గుర్తొచ్చేది ఈ చిత్రంలో విలన్‍గా నటించిన సిఎస్‍ఆర్, ‘ఈశ్వర’ అనే ఊతపదాన్ని ఆయన ఉచ్చరించిన తీరు. మచ్చుకిక్కడ ఒక దృశ్యానికి లంకె ఇస్తున్నాం.
మంచి కళాకారుల్ని సకాలంలో సంస్మరించే ఈ సత్సంప్రదాయాన్ని శ్రీ శాస్త్రి ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ వారిని అభినందిద్దాం.

Narasimha చెప్పబడిన,
జూలై 14, 2012 వద్ద 5:46 సా.
Very good recollection of our yesterday’s actors