సాహితీవైద్యం
రచన మాసపత్రికలో నిర్వహించబడుతున్న సాహితీవైద్యం శీర్షిక కథకుల ప్రయోజనానికి ఉద్దేశించబడింది. అక్షరజాలంలో ఈ శీర్షిక- మా అనుభవం, అవగాహనల ఆధారంగా, మా పరిమితులకు లోబడి సాహిత్యానికి సంబంధించిన అన్ని ప్రక్రియలకూ అంటే కథ, నాటిక, వ్యాసం, కవిత, టీవీ సంభాషణలు, సినిమా సంభాషణలు వగైరాలకి వేదిక కాగలదని ఆశిస్తున్నాం. విశ్లేషణకీ, ప్రచురణకీ రచనలు పంపేవారు వ్రాతప్రతుల్ని లేఖిని స్క్రిప్టులో టైపుచేసి పంపవలసి ఉంటుంది.
ప్రస్తుతం టీవీలో తెలుగు ఛానెల్సు చాలా ఉన్నాయి. ఇంకా వస్తున్నాయి. అన్నీ తెలుగు సీరియల్సుకి ప్రాధాన్యమిస్తున్నాయి. ఎంతోమంది రచయితలకి వాటికి సంభాషణలు వ్రాసే అవకాశం రావచ్చు. టీవీ, సినిమా సంభాషణలకి మామూలుగా కథలకి వ్రాసినట్లు కాక, కాగితాన్ని సగానికి మడతపెట్టి వ్రాయాలి. మచ్చుకి అమ్మమ్మ.కాం సీరియల్ కోసం మేము వ్రాసిన మొదటి ఎపిసోడ్ సంభాషణల వ్రాతప్రతిని ఇక్కడ చూడగలరు. దర్శక నిర్మాతలు వీటిలో కొన్నింటిని మాత్రమే ఉపయోగించుకున్నట్లు సీరియల్ చూసినవారు గ్రహించగలరు.
ఈ నెల రచన మాసపత్రిక సాహితీవైద్యంలో- కథా కమామీషూలో ప్రస్తావించిన పేరులొ ఏముంది కథ, టూకీగా ప్రస్తావించిన ఆకునూరి మురళీకృష్ణ 3 కథల కొసం ఇక్కడ క్లిక్ చేయండి. chandraharam manvadena ninnu_ninnuga
ఇంకా ఈ శీర్షికలో విశేషాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
B.Ravikumar చెప్పబడిన,
మే 16, 2012 వద్ద 12:00 పూర్వాహ్నం
వసుంధర గారు,
నమస్కారం!
మీకు చాలాకాలం క్రితం సాహితీవైద్యం ద్వారా పరిచయం నాది. ఈ వెబ్ పేజ్ లో సూచించిన అమ్మమ్మ.కాం సీరియల్ లోని మీ మొదటి ఎపిసోడ్ లింక్ పనిచెయ్యటం లేదు. కాస్త చూసిపెట్టగలరా..
http://edulent.net/Vasundhara/ammammadotcom_introduction.pdf
ధన్యవాదాలు,
బి. రవికుమార్
వసుంధర చెప్పబడిన,
మే 17, 2012 వద్ద 9:20 పూర్వాహ్నం
ఆరంభంలో అక్షరజాలం ఎడ్యులెంట్ వెబ్‍సైటుకి అనుబంధంగా వచ్చింది. ఆ సైటు తాత్కాలికంగా నిలిపివెయ్యడంతో కొన్ని లంకెలు రావడంలేదు. వీక్షకులు కోరినప్పుడు వాటిని పునరుద్ధరిస్తున్నాం. మీరడిగిన మొదటి ఎపిసోడ్, టివిలో వచ్చిన ఆ సీరియల్ మొదటి ఎపిసోడ్ లంకెలు అమిర్చాము. ఇప్పుడు క్లిక్ చేసి చూడండి.
B.Ravikumar చెప్పబడిన,
మే 17, 2012 వద్ద 11:36 పూర్వాహ్నం
ఇప్పుడు పనిచేస్తోంది. చాలా థాంక్సండీ..
sharada చెప్పబడిన,
జనవరి 28, 2012 వద్ద 11:44 అపరాహ్నం
కథలు ఇతర మాస వార పత్రికలలో ప్రచురింపబడిన తరువాత మీ అభిప్రాయం కావలసిన వారు ఏం చేయవలసి వుంటుంది? ఆ కథ యొక్క కాపీ మీకు పంపించాలా? లేక మీరే సమీక్షకై ఎన్నుకుంటారా? వివరించగలరు
శారద
వసుంధర చెప్పబడిన,
జనవరి 29, 2012 వద్ద 12:00 అపరాహ్నం
వీలుంటే కథ కాపీ పిడిఎఫ్ ఫైలుగా మెయిల్ చెయ్యొచ్చు. అక్షరజాలంలో పరిచయం చేస్తున్న పత్రికల సంచికలు మా దగ్గిరుంటాయి కాబట్టి- పత్రిక తేదీ, పేజి నంబరుతో రచన వివరాలు ఇస్తే సరిపోతుంది. రచన ప్రచురించబడిందంటే అది కొందరికి నచ్చిందనే అర్థం. కథకుల ప్రయోజనార్థం మేము రచన మాసపత్రికలో ఇస్తున్న విశ్లేషణను- కేవలం మా అభిప్రాయంగానే గ్రహించాలి తప్ప కథపై తీర్పు కాదని మనవి.